Delhi : ఢిల్లీ లో మందకొడిగా పోలింగ్.. మధ్యాహ్నానికి పంజుకుంటుందా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే తక్కువ శాతం ఓట్లు నమోదయ్యాయి.

Update: 2025-02-05 07:10 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే తక్కువ శాతం ఓట్లు నమోదయ్యాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ కేవలం ఇరవై శాతం పోలింగ్ మాత్రమే నమోదయిందని ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ అనుకున్న స్థాయిలో నమోదు కావడం లేదని, పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

సెలవు దినం కావడంతో...
అయితే ఈరోజు సెలవు దినం కావడంతో పాటు ఉదయం నుంచి చలిగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఓట్లు వేయడానికి బయటకు రాలేదని చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వచ్చే అవకాశముంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.55 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది.


Tags:    

Similar News