పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రధాని షాకింగ్ కామెంట్స్

దేశంలో రోజురోజుకూ పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర..

Update: 2022-04-27 10:37 GMT

న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకూ పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగానే దేశంలో పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కరోనా కట్టడికి సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలోనే మోదీ పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలపై ఈ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ "పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలే కార‌ణం. రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాట్‌ను త‌గ్గిస్తేనే పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ఇంధన ధరలు తగ్గుతాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గించినా.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాట్‌ను త‌గ్గించ‌డం లేదు. తెలంగాణ‌, ఏపీ, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాట్ తగ్గించకపోవడం వల్లే పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికైనా ఆయా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించాలి" అని ప్రధాని మోదీ హితవు పలికారు.


Tags:    

Similar News