నేడు ఆకాశంలో అద్భుతం.. ప్లానెట్ లో పరేడ్
ఆకాశంలో నేడు ప్లానెట్ పరేడ్ ఆవిష్కృతం కానుంది. ఒకేవరసలో ఏడు గ్రహాలు వచ్చి కనువిందు చేయనున్నాయి
ఆకాశంలో నేడు ప్లానెట్ పరేడ్ ఆవిష్కృతం కానుంది. ఒకేవరసలో ఏడు గ్రహాలు వచ్చి కనువిందు చేయనున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఈ అద్భుత విన్యాసాన్ని చూడవచ్చని అంటున్నారు. ప్లానెట్ పరేడ్ గా చూస్తున్నారు. మూడు గ్రహాలను నేరుగా చూడవచ్చని అంటున్నారు. బుధుడు, శుక్రుడు, గురుడు, అంగారకుడు, శని, నెఫ్ట్యూన్, యురేనస్ గ్రహాలు వరసగా చూడవచ్చు.
ఈ గ్రహాలను మాత్రం...
శుక్ర,బృహస్పృతి, అంగారక గ్రహాలను నేరుగా చూడవచ్చని ప్లానెట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేరుగా ఇతర గ్రహాలను చూసే ప్రయత్నం చేయవద్దని కూడా సూచిస్తున్నారు. నెఫ్ట్యూన్, యురేనస్ గ్రహాలను మాత్రం టెలిస్కోప్ ద్వారానే చూడాలని ఖగోళ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భారత్ లో ఈరోజు రాత్రి 8.30 గంటలకు ఈ ప్లానెట్ పరడే కనిపిస్తుందని తెలిపారు. మళ్లీ నలభై ఏళ్లకు మాత్రమే ఈ అద్భుత దృశ్యాన్నిచూసే వీలుందని తెలిపారు.