Petrol : ఇండియాలో పెట్రోలు ధర.. లీటరు పై పదిహేను రూపాయలు తగ్గింపు

దేశ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు లీటర్ పై రెండు రూపాయలు తగ్గినా లక్షద్వీప్ లో మాత్రం పదిహేను రూపాయలు తగ్గింది

Update: 2024-03-17 03:49 GMT

ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ పై రెండు రూపాయలు తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో ఒక ప్రాంతంలో మాత్రం లీటరు పెట్రోలు, డీజిల్ పై పదిహేను రూపాయలు తగ్గింది. అదీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ తగ్గింపు చేేపట్టింది. అదిలక్షద్వీప్ లో మాత్రమే ఈ పదిహేను రూపాయల తగ్గింపు వర్తిస్తుంది. దేశ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు లీటర్ పై రెండు రూపాయలు తగ్గినా లక్షద్వీప్ లో మాత్రం పదిహేను రూపాయలు తగ్గించడం విశేషం.

గతంలో పెంచి....
గతంలో పెంచిన ధరలను ఇప్పుడు తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ద్వీపాలకు పెట్రోలు, డీజిల్ సరఫరా చేయడానికి అధిక వ్యయం అవుతుంది. అందుకోసమే గతంలో ఇక్కడ పెట్రోలు, డీజిల్ ధరలను పెంచింది. కానీ ఇప్పుడు ఆ ధరలను తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. లక్షద్వీప్ లో పదిహేను రూపాయలు, మరికొన్ని దీవుల్లో ఐదు రూాపాయలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నిజంగా అక్కడ ఉన్న వారికి అది శుభవార్తే.


Tags:    

Similar News