పెట్రోల్-డీజిల్ ధరలను భారీగా తగ్గించేసిన కేంద్ర ప్రభుత్వం

పెట్రోల్-డీజిల్ ధరలను భారీగా తగ్గించేసిన కేంద్ర ప్రభుత్వం

Update: 2022-05-21 13:54 GMT

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తద్వారా లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 మేర తగ్గనుందని, లీటర్ డీజిల్ ధర రూ.7 మేర తగ్గనుందని వివరించారు. ఇటీవల మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 మధ్య కాలంలో పెట్రో ధరలను 14 సార్లు పెంచారు. లీటర్ పై గరిష్ఠంగా రూ.10 వరకు పెరిగింది.

గ్యాస్‌ సిలిండర్‌పై 200 రూపాయలు రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. అలాగే చమురుపై సెంట్ర‌ల్ ఎక్సైజ్ సుంకాన్ని భారీగా త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కేంద్రం తగ్గించిందే కాకుండా రాష్ట్రాల్లో పెట్రోల్‌పై అదనంగా మరో రూపాయిన్నర, డీజిల్‌పై అదనంగా మరో రూపాయి తగ్గే అవకాశం ఉంది.

Tags:    

Similar News