Holi : నేడు దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు

నేడు దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలను ప్రజలు జరుపుకోనున్నారు.

Update: 2025-03-14 02:04 GMT

నేడు దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలను ప్రజలు జరుపుకోనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హోలీ వేడుకలు అత్యంత వేడుకగా జరనున్నాయి. హోలీ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నగరంలో ఆంక్షలు విధించారు. రేపు ఉదయం ఆరు గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అలాగే ఈరోజు సాయంత్రం వరకూ మద్యం దుకాణాలను కూడా బంద్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ లో ఆంక్షలు...
హోలీ సందర్భంగా రంగులు చల్లుకుని పండగ చేసుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా హోలీ వేడుకలను ముగించాలని నగర పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనదారులపై రంగులు చల్లవద్దంటూ హెచ్చరిక జారీ చేశారు. హోలీ సందర్భంగా చిన్నారుల నుంచి పెద్దల వరకూ హోలీ పండగలో పాల్గొని రంగులు చల్లుకుంటారు. నేచురల్ కలర్స్ వాడాలని వైద్యులు సూచించారు. లేకుంటే కళ్లు దెబ్బతినే అవకాశముందని హెచ్చరించారు.


Tags:    

Similar News