Parliament : శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా
పార్లమెంటు సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకునే అవకాశముంది
పార్లమెంటు సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకునే అవకాశముంది. నిన్న ఫలితాలు వచ్చిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్ ఎన్నికలలో సాధించిన ఘన విజయంతో అధికార పార్టీ ఉత్సాహంతో ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికల్లో తమకు లభించిన విజయాన్ని సెలిబ్రేట్ చేసుకున్నారు. దీంతో ప్రతిపక్షాలను నిలువరించేందుకు ప్రజల తీర్పు మనవైపే ఉందని చెప్పడానికి అధికార పార్టీకి ఒక అవకాశం చిక్కినట్లయింది.
అనేక అంశాలపై...
దీంతో పాటు కీలక బిల్లులను ఆమోదం పొందేందుకు అవకాశం కూడా ఉంది. అయితే విపక్షాలు కూడా తగ్గే పరిస్థితులు కనిపించేట్లు లేవు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న పెట్రోలు ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు వంటి వాటితో నిత్యావసరాల ధరల పెరుగుదలపై కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశముంది. అంతే కాకుండా వివిధ అంశాలపై చర్చకు పట్టుబట్టాలని, అధికార పార్టీని నిలదీయాలని కాంగ్రెస్ తో పాటు విపక్షాలు నిర్ణయించాయి. దీంతో శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.