బెంగళూరు నగరానికి ఆరెంజ్ అలర్ట్.. ఇరుక్కుపోయిన బెంజ్ కార్

బెంగళూరు నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. బెంగళూరు నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి వచ్చేసింది. మంగళవారం రాత్రి నగరంలోని చాలా ప్రాంతాలు భారీ వర్షాన్ని చూశాయి.

Update: 2022-05-18 04:42 GMT

బెంగళూరు నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. బెంగళూరు నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి వచ్చేసింది. మంగళవారం రాత్రి నగరంలోని చాలా ప్రాంతాలు భారీ వర్షాన్ని చూశాయి. వీధులు, ఇళ్లను వరదలు ముంచెత్తాయి, వర్షపు నీరు కారణంగా ట్రాఫిక్‌ జామ్ అయింది. వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దక్షిణ బెంగళూరులోని నరసింహ కాలనీలోని మురికివాడలోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇందిరానగర్, మహదేవపుర, హోసకెరెహళ్లి, జీవన్బీమా నగర్ తో సహా 15 ప్రాంతాల నుండి BBMP కంట్రోల్ రూమ్‌కు వరదలు వచ్చినట్లు ఫిర్యాదులు అందాయి.


రాత్రి 10 గంటలకు నమోదైన సమాచారం ప్రకారం.. బీబీఎంపీలోని కనీసం మూడు జోన్స్ లో కేవలం అరగంట సమయంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెంగళూరు లోని తూర్పు (10.05 సెం.మీ.), దక్షిణ (11.3 సెం.మీ.), పశ్చిమ (10 సెం.మీ.) జోన్లలో భారీ వర్షం పడింది. మరో వైపా బుధవారం బెంగళూరుకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం నాడు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. భారత వాతావరణ శాఖ (IMD) రాబోయే ఐదు రోజుల పాటు సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేసింది.

మంగళవారం భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. మోకాలి లోతు నీరు అనేక ప్రాంతాల్లో ఉంది. ఒక వీడియోలో మెర్సిడెస్ బెంజ్ SUV కారు ఉండిపోయింది. రహదారిపై ఇరుక్కుపోయి కనిపించింది. ఒక వైపు గుంతలో ఇరుక్కోగా.. మరో వైపు భాగం గాల్లో ఉండిపోయింది. ఉరుములతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ వైఫల్యం చోటు చేసుకోవడంతో మంత్రి మాల్ స్టేషన్ వద్ద గ్రీన్ లైన్‌లో మెట్రోను నిలిపివేయాల్సి వచ్చింది. JP నగర్, జయనగర్, లాల్‌బాగ్, చిక్‌పేట్, మెజెస్టిక్, మల్లేశ్వరం, రాజాజీనగర్, యశ్వంత్‌పూర్, MG రోడ్, కబ్బన్ పార్క్, విజయనగర్, రాజరాజేశ్వరి నగర్, కెంగేరి, మాగడి రోడ్, మైసూర్ రోడ్ ప్రాంతాలు కూడా వర్షానికి ప్రభావితమయ్యాయి.


Tags:    

Similar News