భారత్ లో వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్ లో పెరుగుతున్నాయి. క్రమంగా ఆ సంఖ్య 61 కు చేరుకుంది.

Update: 2021-12-15 01:27 GMT

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్ లో పెరుగుతున్నాయి. క్రమంగా ఆ సంఖ్య 61 కు చేరుకుంది. సౌతాఫ్రికాలో ప్రారంభమైన వేరియంట్ వేగంగా విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా 12 దేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోనూ వేగంగా విస్తరించే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే 61కి చేరడంతో....
ప్రస్తుతం భారత్ లో 61 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా మహారాష్ట్ర లోనే ఈ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 28 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కోవిడ్ నిబంధనలను పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News