భారత్ లో విస్తరిస్తున్న ఒమిక్రాన్.. ఒక్కరోజులోనే?

భారత్ ను ఒమిక్రాన్ వణికిస్తోంది. రోజురోజుకూ ఈ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Update: 2021-12-28 03:57 GMT

భారత్ ను ఒమిక్రాన్ వణికిస్తోంది. రోజురోజుకూ ఈ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. నిన్న ఒక్కరోజే దేశంలో 135 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ వేరియంట్ విస్తరించింది. గోవాలో ఎనిమిదేళ్ల బాలుడికి ఒమిక్రాన్ వేరియంట్ సోకడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసులు ఆరు వందలు దాటడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

ఢిల్లీలో ఎక్కువగా...
నిన్ని నమోదయిన 135 కేసుల్లో 63 కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 142కు చేరుకుంది. మహారాష్ట్రంలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 167కు చేరుకుంది. దీంతో ప్రభుత్వాలు ఆంక్షలను విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. బహిరంగ సమావేశాలు, ఫంక్షన్లపై నిషేధం విధించాయి. ఈరోజు కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనుంది.


Tags:    

Similar News