జలుబే కదా అని లైట్ తీసుకోవద్దు : డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ వ్యాప్తిపై ఓ హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ ను సాధారణ జలుబుగా పరిగణించవద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది.

Update: 2022-01-06 08:40 GMT

కరోనా తో పాటు.. కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. రోజువారీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ సైతం తీవ్ర ప్రభావం చూపుతుండటంతో.. అగ్రరాజ్యం వణికిపోతోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ వ్యాప్తిపై ఓ హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ ను సాధారణ జలుబుగా పరిగణించవద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది.

జలుబు చేస్తే.. సాధారణ జలుబే కదా అని లైట్ తీసుకుంటే అది మరింత ప్రమాదకారిగా మారే ముప్పు ఉందంటూ WHO టెక్నికల్‌ లీడ్‌ మరియా వాన్‌ కేర్ఖోవ్‌ హెచ్చరిస్తున్నారు. మొదట్నుంచి చెప్తున్నట్లు ఈ వ్యాధి తీవ్రత తక్కువే అయినా.. తేలికగా తీసిపారేసే వ్యాధిమాత్రం కాదని ఆయన తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు ఒమిక్రాన్ బారిన పడితే.. అది తీవ్రఅనారోగ్య పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ రోగులతో ఆస్పత్రులన్నీ నిండిపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.







Tags:    

Similar News