భయపెడుతున్న ఒమిక్రాన్ కేంద్రం అలెర్ట్

ఒమిక్రాన్ కేసులు భారత్ లో పెరుుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని ఆంక్షలను విధించాలని నిర్ణయించింది

Update: 2022-01-08 03:15 GMT

ఒమిక్రాన్ కేసులు భారత్ లో పెరుుగుతున్నాయి. ఇప్పటికే 3005 కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ కట్టడికి మరికొన్ని ఆంక్షలను విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారు విధిగా వారం రోజులు క్వారంటైన్ లో ఉండాలని నిబంధనను కొత్తగా విధించింది. ఇప్పటి వరకూ వారికి కరోనా పాజిటివ్ గా తేలితేేనే ఐసొలేషేన్ కు పంపేవారు.

రిస్క్ దేశాల నుంచి....
కానీ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడు వారం రోజుల పాటు క్వారంటైన్ కు వెళ్లాల్సిందేనన్న నిబంధనను విధించారు. విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం రిపోర్టు వచ్చేంత వరకూ వెయిట్ చేయాలి. రిపోర్టు వచ్చి పాజిటివ్ గా తేలితే ఐసొలేషన్ కు వెళ్లాలి. నెగిటివ్ వచ్చినా వారం రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇటలీ నుంచి అమృత్ సర్ కు వచ్చిన విమానంలో 125 మందికి పాజిటివ్ గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త మార్గదర్శకాలు ఈ నెల 11వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్నాయి.


Tags:    

Similar News