గుడ్ న్యూస్ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన చమురు సంస్థలు గ్యాస్, పెట్రోలు వంటి వాటి ధరలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటాయి. దీంతో ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్, పెట్రోలు ధరలు పెరగడమా? లేదా? తగ్గడమా? అన్నది జరుగుతుంది. అయితే ఈరోజు చమురు సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై...
వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై 14.50 రూపాయలు తగ్గించిన చమురు సంస్థలు విమాన ఇంధనం ధర 4.4 శాతం క్షీణించింది. దీంతో చిరు వ్యాపారులతో గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం ఊరట కల్గించే అంశమే. ఇక గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు తెలిపాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరల సవరించే చమురుసంస్థలు వరుసగా రెండో నెలలో కూడా ధరను తగ్గించింది.