బాదుడు ఆగడం లేదు.. మళ్లీ పెరిగిన పెట్రోలు ధరలు

వరసగా నాలుగోరోజు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి

Update: 2022-03-26 02:07 GMT

పెట్రోలు ధరల పెంపుపై చమురు సంస్థలు ఏమాత్రం కనికరం చూపడం లేదు. ఐదు నెలల సమయంలో తమ ఆదాయాన్ని ఒక్కసారిగా నింపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వరసగా నాలుగోరోజు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోలు పై 89 పైసలు, డీజిల్ పై 86 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో వినియోగదారులకు మరింత భారం కానుంది.

ఎన్నికల ఫలితాల తర్వాత.....
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు చమురు సంస్థలు ఐదు నెలల పాటు ధరలు పెంచలేదు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. రోజుకు 80 పైసలకు పైగానే పెంచుతూ వినియోగదారుల తాట ీతీస్తున్నాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 111.70 కు చేరుకుంది. ఇక లీటర్ డీజిల్ ధర 98.09 కు చేరుకుంది. చమురు సంస్థల ధరల పెంపుదలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News