భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్... మరో రెండు కేసులు
భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరుగుతుంది. మరో రెండు కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది.
భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరుగుతుంది. మరో రెండు కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. గుజరాత్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఈ మధ్య కాలంలో యూకే నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు గుర్తించారు.
గుజరాత్ లో.....
దీంతో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమయింది. వేగంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. భారత్ లో కేవలం పది రోజుల వ్యవధిలోనే 145 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పదకొండు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ ఎంటర్ అయింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రెండు, తెలంగాణలో ఇరవై కేసులు నమోదయ్యాయి.