రిజిస్ట్రేషన్ లేకుండానే కోవిడ్ మూడవ టీకా

తొలి రెండు డోసుల టీకా ఏ కంపెనీది తీసుకున్నారో.. మూడవ డోస్ కూడా అదే ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రకటించారు.

Update: 2022-04-09 09:08 GMT

న్యూ ఢిల్లీ : కరోనాను నివారించేందుకు ఇప్పటికే రెండు డోసుల టీకా ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది కేంద్రం. తాజాగా 18 సంవత్సరాలు నిండిన వారందరికీ మూడవ డోస్ టీకాను కూడా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదివారం (ఏప్రిల్ 10) నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే మూడవ టీకా తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీనిని ప్రికాషనరీ డోస్ గా పరిగణిస్తోంది కేంద్రం.

తొలి రెండు డోసుల టీకా ఏ కంపెనీది తీసుకున్నారో.. మూడవ డోస్ కూడా అదే ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రకటించారు. రాష్ట్రాల ఆరోగ్య శాఖల కార్యదర్శులతో సమావేశం అనంతరం శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రికాషనరీ డోసుగా పేర్కొంటున్న మూడవ డోసు తీసుకునేందుకు కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నారు. రెండవ డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారంతా ప్రికాషనరీ డోసు తీసుకునేందుకు అర్హులని కేంద్రం ప్రకటించింది. కానీ.. ఈ డోసు కోసం కాస్త ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే ప్రికాషనరీ డోసులు అందుబాటులో ఉండనున్నాయి. కోవిషీల్డ్ ధర రూ.600 ఉంటుందని సిరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత అధర్ పూనవాలా ప్రకటించిన సంగతి తెలిసిందే.





Tags:    

Similar News