BJP : నేడు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నేడు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు

Update: 2026-01-20 02:31 GMT

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నేడు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నిన్న నామినేషన్ల ప్రక్రియపూర్తయింది. అయితే నితిన్ నబిన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. చిన్న వయసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యలను స్వీకరించనున్నారు.

జాతీయ అధ్యక్షుడిగా...
ఈరోజు నితిన్ నబిన్ ఎన్నకయినట్లు అధికారికంగా ప్రకటించిన వెంటనే ఆయన ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా తో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు.


Tags:    

Similar News