Fastag : టోల్స్ వసూళ్లలో కొత్త రూల్స్ ఇవే.. జాగ్రత్తగా ఉండాల్సిందే

టోల్ గేట్ ఫీజు వసూళ్లలో కొత్త నిబంధనలను ఈ నెల 17వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి

Update: 2025-02-14 12:18 GMT

టోల్ గేట్ ఫీజు వసూళ్లలో కొత్త నిబంధనలను ఈ నెల 17వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఆలస్యమయితే డబుల్ ఛార్జ్ వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 17 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఫాస్టాగ్ లో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, కేవైసీ పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్లిపోతుందని తెలిపారు.

టోల్ గేటుకు చేరుకునే సమయానికి...
టోల్ గేటుకు చేరుకునే సమయానికి అరవై నిముషాలు కంటే ఎక్కువ టైం ఫాస్టాగ్ ఇనాక్టివ్ లో ఉండకూడదని తెలిపారు. బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుందని జాతీయ రహదారుల సంస్థ స్పష్టం చేసింది. స్కాన్ చేసిన 10 నిముషాలు తర్వాత ఇన్ యాక్టివ్ లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారని తెలిపారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది.


Tags:    

Similar News