ముస్లిం యువ‌తి 16 ఏళ్లు నిండ‌గానే త‌న‌కు ఇష్ట‌మైన వ్య‌క్తిని వివాహం చేసుకోవ‌చ్చు

16, 21 సంవత్సరాల వయస్సు గల ముస్లిం జంటకు వారి కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పిస్తూ, పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం నాడు

Update: 2022-06-20 10:37 GMT

యువ‌తుల వివాహ వ‌య‌స్సుకు సంబంధించి పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టు సోమ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ముస్లిం యువ‌తి 16 ఏళ్లు నిండ‌గానే త‌న‌కు ఇష్ట‌మైన వ్య‌క్తిని వివాహం చేసుకోవ‌చ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. ష‌రియా చ‌ట్టం ప్ర‌కారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువ‌తులు త‌మ‌కు ఇష్ట‌మైన యువ‌కుడిని పెళ్లి చేసుకునే హ‌క్కు ఉంది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన హైకోర్టు... ముస్లిం యువ‌తి 16 ఏళ్లు నిండ‌గానే పెళ్లి చేసుకునేందుకు అర్హురాలేన‌ని తేల్చి చెప్పింది. 16 ఏళ్లు నిండిన ఓ యువ‌తి త‌న‌కు ఇష్ట‌మైన వ్యక్తిని పెళ్లి చేసుకుని త‌మ‌కు ర‌క్ష‌ణ కల్పించాలంటూ పంజాబ్‌, హ‌ర్యానా కోర్టును ఆశ్ర‌యించింది. స‌ద‌రు యువ‌తి పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ష‌రియా చ‌ట్టాన్ని ఉటంకిస్తూ వారి వివాహాన్ని గుర్తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ష‌రియా చ‌ట్టం ప్ర‌కారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతికి త‌న‌కు ఇష్ట‌మైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హ‌క్కు ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

16, 21 సంవత్సరాల వయస్సు గల ముస్లిం జంటకు వారి కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పిస్తూ, పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం నాడు ఈ తీర్పు ఇచ్చింది. 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ముస్లిం అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తితో వివాహ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అర్హురాలిగా తీర్పునిచ్చింది. . రక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన పఠాన్‌కోట్‌కు చెందిన ముస్లిం దంపతులు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. "పిటిషనర్లు వారి కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నందున, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను వారు హరించలేరు" అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ల ప్రకారం వారి వివాహం జూన్ 8, 2022న ముస్లిం ఆచారాల ప్రకారం జరిగింది. అయితే, వారి కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వారి అనుమతి లేకుండా వివాహం చేసుకున్నందుకు వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.


Tags:    

Similar News