ఆలయానికి ముస్లిం వ్యాపారి కోటి విరాళం
కర్ణాటక రాష్ట్రం చెన్నపట్టణ మంగళవారపేటలో ఉన్న శ్రీబసవేశ్వర స్వామి ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు సాగుతూ ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రం చెన్నపట్టణ మంగళవారపేటలో ఉన్న శ్రీబసవేశ్వర స్వామి ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు సాగుతూ ఉన్నాయి. పలువురు తమ వంతు సాయాన్ని అందిస్తూ వచ్చారు. అయితే ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ ఉల్లా సఖాఫ్ కోటి రూపాయలను విరాళం ఇచ్చారు. పూర్తిగా తన సొంత ఖర్చుతో ఆ పనులన్నీ చేయించడం విశేషం. ఈ ఆలయ విస్తరణకు వీలుగా స్థానికులైన కెంపమ్మ, మోటేగౌడ తమ స్థలం కేటాయించారు. సయ్యద్ ఉల్లా సఖాఫ్ గతంలోనూ మోగేనహళ్లి గ్రామంలో వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించారు. మనం చేసే మంచి పనులతోనే తదుపరి తరాలు బాగుంటాయనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని సఖాఫ్ తెలిపారు.