ఒమిక్రాన్ ఎఫెక్... భారత్ లో ఆంక్షల కొనసాగింపు

ఒమిక్రాన్ పై ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న హెచ్చరికలతో మోదీ అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధించాలని నిర్ణయించారు

Update: 2021-11-27 14:01 GMT

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న హెచ్చరికలతో ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. ఆంక్షలను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఒమిక్రాన్ పై ప్రధాని మోదీ సమీక్షించారు.

అనేక దేశాలు....
ఇప్పటికే అనేక దేశాలు ఆఫ్రికా దేశాలపై ఆంక్షలను విధించాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులను వచ్చే నెల 15వ తేదీ నుంచి పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అంతర్జాతీయ విమాన రాకపోకలపై నిషేధాన్ని కొనసాగించాలని మోదీ అధికారులను ఆదేశించారు.


Tags:    

Similar News