2022-23 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.2 శాతంగా నమోదవ్వచ్చని.. ఈ సర్వేలో తెలిసింది. ఈ ఏడాది ఆర్థిక పరిస్థితులు..

Update: 2022-01-31 11:00 GMT

సోమవారం ఉదయం పార్లమెంట్ లో 2022-23 యూనియన్ బడ్జెట్ మొదటి దశ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిరేటును 8 నుంచి 8.5 శాతం వరకూ అంచనా వేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.2 శాతంగా నమోదవ్వచ్చని.. ఈ సర్వేలో తెలిసింది. ఈ ఏడాది ఆర్థిక పరిస్థితులు.. భారత్ లో కరోనా ముందునాటి స్థితికి చేరుకోవచ్చని సర్వే అంచనా వేసింది. సేవల రంగంలో 8.2 శాతం, వినియోగంలో 7 శాతం వృద్ధి ఉండొచ్చని తెలిపింది. ఆర్థిక సర్వే ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది కాబట్టి.. ఈసారి ప్రతిపాదించే బడ్జెట్ ద్వారా దేశం ముందున్న సవాళ్లను కొంతమేర అధిగమించవచ్చని తెలుస్తోంది.


Tags:    

Similar News