Nara Lokesh : తల్లికి వందనం పథకం డబ్బులు పడని వారు ఈ పనిచేయాలి
తల్లికి వందనం పథకం కింద నిధులు తల్లుల ఖాతాల్లో జమ అవుతున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
తల్లికి వందనం పథకం కింద నిధులు తల్లుల ఖాతాల్లో జమ అవుతున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వం 42 లక్షలమంది పిల్లలకు అమ్మఒడి అందిస్తే, తమ ప్రభుత్వం 67 లక్షల మంది పిల్లలకు ఇచ్చామన్నారు. తల్లుల ఖాతాల్లో నగదు వరసగా నిధులు జమ అవుతున్నాయని, వారి ఖాతాల్లో పదమూడు వేల రూపాయల నిధులను జమ చేస్తున్నామని చెప్పారు. రెండు వేల రూపాయలు మరుగుదొడ్లు, పాఠశాలల నిర్వహణ కోసం వెచ్చించనున్నామని నారా లోకేశ్ తెలిపారు.
జూన్ 26వ తేదీన...
తల్లికి వందనం పథకం కింద నిధులు జమ కాని వారు జూన్ 26వ తేదీ వరకూ మన మిత్ర వాట్సప్ నెంబరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుని అర్హులైన వారందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. దీంతో పాటు వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నామని నారా లోకేశ్ తెలిపారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని కోరుతున్నానని తెలిపారు. విద్యారంగ చరిత్రలో పలు సంస్కరణలను తెచ్చామని నారా లోకేశ్ తెలిపారు. తల్లికి వందనం పథకం కింద మంజూరు చేసిన నిధుల్లో రెండు వేల రూపాయలు తన ఖాతాల్లో పడ్డాయన్న విమర్శలను ఆయన ఖండించారు. దీనిపై తాను న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నారా లోకేశ్ తెలిపారు.