భారత్ కు వైరస్ ముప్పు.. మూడు వారాలు కీలకం

భారత్ లో వచ్చే రెండు మూడు వారాలు కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల ఉధృతి కొనసాగే అవకాశముంది

Update: 2022-10-19 06:36 GMT

భారత్ లో వచ్చే రెండు మూడు వారాలు కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల ఉధృతి కొనసాగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా కేసులు మాత్రం అదుపులోనే ఉన్నాయి. ఒక్కరోజులో 2,60,806 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వీరిలో 1,946 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా పాజిటివిటీ రేటు 0.75 శాతంగా నమోదయిందని అధికారులు తెలిపారు.

వ్యాక్సినేషన్ ను...
ఇప్పటి వరకూ భారత్ లో 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4.40 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకూ 5,28,923 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. ప్రస్తుతం భారత్ లో 25,968 యాక్టివ్ కేసులున్నాయని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. యాక్టివ్ కేసుల శాతం 0.06 శాతంగా నమోదయింది. ప్రస్తుతం 219.41 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.


Tags:    

Similar News