కేబినెట్ లో ఉద్ధవ్ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామాకు సిద్ధమవుతున్నారు. మంత్రి వర్గ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు

Update: 2022-06-29 13:39 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామాకు సిద్ధమవుతున్నారు. మంత్రి వర్గ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశముంది. మహారాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. తన వల్ల తప్పులేమైనా ఉంటే క్షమించాలని మంత్రివర్గ సభ్యులను ఉద్ధవ్ థాకరే కోరారు. కేబినెట్ భేటీలో మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. రెండున్నరేళ్ల పాటు సహకరించిన అందరికీ ఉద్ధవ్ థాక్రే కృతజ్ఞతలు తెలిపారు.

పేర్ల మార్పు...
మహారాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉస్మానాబాద్ పేరును ధారా శివ్ గా, ఔరంగాబాాద్ పేరు శంభాజీనగర్ గా పేరు గా, డీబీపాటిల్ ఎయిర్ పోర్టుగా నవీ ముంబయి ఎయిర్‌పోర్టుగా పేరు మర్చారు. రేపు మహారాష్ట్ర శాసనసభలో బలపరీక్ష జరగనుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉద్ధవ్ థాక్రే రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News