మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం.. విజయ్, ప్రభుత్వానికి కూడా?
తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభలో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది
తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభలో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేయాలని కోర్టు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆస్రా గార్గ్ నేతృత్వంలో బృందం దర్యాప్తు చేపడుతుంది. ప్రస్తుతం గార్గ్ నార్త్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఒకే న్యాయమూర్తి ధర్మాసనం ఈ ఘటనపై తమిళగ వెట్రి కజగం నిర్వాహకులను విమర్శించినట్లు సమాచారం.
ప్రత్యేక దర్యాప్తు బృందం చేత...
విజయ్ రాజకీయ నేతగా వ్యవహరించలేదని అభిప్రాయపడింది. ఘటన జరిగిన తర్వాత మృతుల కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. అదే సమయంలో విజయ్ ప్రయాణించిన వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని కూడా న్యాయస్థానం నిలదీసింది. కరూర్ ఘటనలో 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పై నిందితుల పిటీషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.