వీరుడైన ఆర్మీ అధికారి శశాంక్ తివారీ – సైనికుడిని కాపాడుతూ మృతి

సిక్కింలో వాగులో పడి సైనికుడిని కాపాడే ప్రయత్నంలో లెఫ్టినెంట్ తివారీ ప్రాణాలు కోల్పోయారు.

Update: 2025-05-24 11:24 GMT

తోటి సైనికుడిని కాపాడబోయి ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. సిక్కింలో తన బృందంలోని సైనికుడు వాగులో పడి కొట్టుకుపోతుండగా ఆర్మీ అధికారి అతనిని కాపాడబోయి, నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. లెఫ్టినెంట్ శశాంక్ తివారీ సిక్కింలోని వ్యూహాత్మక ఆపరేటింగ్ పెట్రోలింగ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఓ పోస్ట్ వైపు కదులుతుండగా, అగ్నివీర్ స్టీఫెన్ సుబ్బా లాగ్ వంతెనను దాటుతూ, కాలు జారి వాగులో పడిపోయారు. దీనిని గమనించిన లెఫ్టినెంట్ తివారీ నీటిలోకి దూకారు. అతనికి మరో సైనికుడు సాయం అందించారు. అగ్నివీర్‌ సుబ్బాను రక్షించగలిగారు. సుబ్బాను రక్షించే ప్రయత్నంలో లెఫ్టినెంట్ తివారీ బలమైన ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఆయన మృతదేహం 30 నిమిషాల తర్వాత 800 మీటర్ల దిగువన కనిపించింది. శశాంక్ తివారీ చూపించిన తెగువకు దేశ ప్రజలు సలాం కొడుతున్నారు.

Tags:    

Similar News