Breaking : జమిలి ఎన్నికలకు నో

జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక సూచనలు చేసింది. 2024లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదని తేల్చి చెప్పింది

Update: 2023-09-29 12:32 GMT

జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక సూచనలు చేసింది. 2024లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో ఎప్పటి మాదిరిగానే షెడ్యూల్ ప్రకారం లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా జమిలి ఎన్నికలకు సిద్ధమవుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లా కమిషన్ చేసిన సూచనతో జమిలి ఎన్నికలు ఇక లేనట్లే.

సాధ్యం కాదని...
ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కష్టసాధ్యమని తేల్చింది. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తు ప్రారంభించింది. దీనిపై అధ్యయనం చేయడానికి కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా వేసింది. అయితే రాజ్యాంగ సవరణ లేకుండా జమిలి ఎన్నికలు సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయపడింది. అనేక ఆర్టికల్స్ లో సవరణ చేయగలిగితేనే జమిలి ఎన్నికలు సాధ్యమవుతుందని తెలిపింది. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇక షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలు ఈ ఏడాది చివరికల్లా నిర్వహించాల్సిన అవసరం ఉంది.


Tags:    

Similar News