నేడు కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు నేడు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు నేడు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. వసంత పంచమి కావడంతో ఎక్కువ మందిభక్తులు తరలి వచ్చారు. వసంత పంచమి రోజున పుణ్యస్నానాలు చేస్తే మంచిదని భావించిన భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అన్నిఘాట్లలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమృత్ స్నాన్ చేయడం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి రావడంతో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వసంత పంచమి కావడంతో...
ప్రయాగరాజ్ కు వచ్చే రహదారుల్లో అనేక వాహనాలు ట్రాఫిక్ జాంతో నిలిచిపోయాయంటున్నారు. ఎక్కడైనా స్నానం చేయవచ్చని, ఒక ఘాట్ కు రావాల్సిన అవసరం లేదని పోలీసులు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకూ మహా కుంభమేళాకు 35 కోట్ల మంది వచ్చి పుణ్యస్నానాలు చేశారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.