Maha kumbh Mela : మహాకుంభమేళాకు హాజరయింది ఇప్పటివరకూ ఎందరంటే?
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ త్రివేణి సంగమంలో 42 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ వరకూ మాత్రమే ఉండటంతో దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ప్రజలు హాజరవుతున్నారు.
యూపీ ప్రభుత్వం...
తొక్కిసలాట ఘటన తర్వాత ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. స్నాన ఘట్టాల వద్ద ఎవరినీ ఎక్కువ సేపు ఉంచకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో ఎక్కువ మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాకు వచ్చిపుణ్యస్నానాలు చేస్తే శుభప్రదమని నమ్ముతున్నారు.