Kerala : కేరళలో దంచి కొడుతున్న వర్షం
కేరళలో భారీ వర్షం పడుతుంది. సోమవారం కురిసిన వర్షంతో పలు జిల్లాల్లో జలమయమయ్యాయి.
కేరళలో భారీ వర్షం పడుతుంది. సోమవారం కురిసిన వర్షంతో పలు జిల్లాల్లో జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. అలప్పుజాలో మత్స్యకారుడు మృతి చెందారు. కేరళలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులు వీయడంతో పలు జిల్లాల్లో వర్షం ఉధృతంగా కొనసాగింది. తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీరు చేరి జనజీవనం అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు.
మత్స్యకారుడు మృతి
అలప్పుజా జిల్లాలోని ఆర్థుంకల్ తీరంలో మత్స్యకారుడి పడవ గాలివాన కారణంగా ఒరిగిపోవడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ మత్స్యకారుడు అక్కడికే చెందిన పౌల్ దేవాసియా గా గుర్తించారు. కేరళలోని ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.