Tiger : ఆ పులిని చంపేయండి.. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ... ప్రభుత్వం ఆదేశాలు
కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మనుషులను చంపేస్తున్న పులిని చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మనుషులను చంపేస్తున్న పులిని చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో ఒక పులిని కేరళ ప్రభుత్వం మ్యాన్ ఈటర్ గా ప్రకటించింది. ఒక పులిని కేరళ ప్రభుత్వం మ్యాన్ ఈటర్ గా ప్రకటించడం ఇదే తొలిసారి అని కేరళ మంత్రి తెలిపారు. వరసగా మనుషులపై దాడులు చేస్తున్న పులిని చంపేయాలని ప్రభుత్వం అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
మహిళను చంపేయడంతో...
వాయనాడ్ కు సమీపంలోని మనంతవాడి గ్రామంలో పులి సంచారం కలకలం రేపుతుంది. అక్కడ టీ తోటల్లో పనిచేస్తున్న పులి ఒక మహిళను చంపేసింది. పులి అక్కడే సంచరిస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాదు మనంత వాడిలో అధికారులు కర్ఫ్యూను కూడా విధించారు. పులి వరస దాడులపై స్పందించిన కేరళసర్కార్ చంపేయాలని ఆదేశించడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి దాని కోసం సెర్చ్ చేస్తున్నారు.