నేటి నుంచి కేదార్ నాథ్ యాత్ర

నేటి నుంచి కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. దీంతో అధిక సంఖ్యలో భక్తులు కేదార్ నాథ్ కు తరలి రానున్నారు.

Update: 2025-05-02 02:15 GMT

నేటి నుంచి కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. దీంతో అధిక సంఖ్యలో భక్తులు కేదార్ నాథ్ కు తరలి రానున్నారు. మే 2వ తేదీన ఈ ఆలయం తెరుస్తామని ముందుగానే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన మేరకే ఈరోజు కేదార్ నాధ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్వాల్ హిమాలయాలలో ఈ ఆలయం కొలువై ఉంది.

శీతాకాలంలోనే...
ప్రతి ఏడాది శీతాకాలంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. భారీగా మంచుకురుస్తుండటంతో అక్కడకు ఎవరూ వెళ్లలేని పరిస్థితి. చార్ ధామ్ యాత్రలో భాగంగా వేసవిలోనే ఈ ఆలయం తెరుచుకుంటుంది. శివుడు మంచు తో ఉన్న ఈ ఆలయాన్ని చూసేందుకు వేలాది మందిభక్తులు వస్తుంటారు. పన్నెండు జ్యోతిర్లింగాల్లో కేదార్ నాథ్ ఆలయం ఒకటి. పహల్గాం దాడితో భారత సైన్యం అప్రమత్తమై భక్తులకు రక్షణ కల్పిస్తుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారినే ఈ ఆలయ దర్శనానికి అనుమతిస్తారు.


Tags:    

Similar News