జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని మరికొంత కాలం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు

Update: 2023-01-17 12:37 GMT

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని మరికొంత కాలం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా 2024 జూన్ నెలవరకూ పదవిలో ఉంటారు. అనేక రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్షుల పదవీకాలాన్ని కూడా పొడిగించనున్నారు. ఇందులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఒకరు. ఈ నాలుగు వందల రోజులు కీలకమని ప్రధాని మోదీ తన ప్రసంగంలో చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో...
రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అనేక అంశాలపై చర్చించారు. ఈ ఏడాది జరగనున్న తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తిరిగి అధికారం దక్కించుకోవడం, లేని చోట పవర్ లోకి రావడంపై నేతలు ప్రధానంగా చర్చించారని తెలిసింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర నేతలకు సంబంధించి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. తొమ్మిది రాష్ట్రాల్లో గెలుపుతో 2024 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి గెలుపును సుస్థిరం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించారు.


Tags:    

Similar News