భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించిన డబ్ల్యూహెచ్ఓ.. ఎంపీ ఆగ్రహం

డబ్ల్యూహెచ్ఓ చేసిన నిర్వాకంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. Covid19.WHO.int వెబ్‌సైట్‌ లోని వరల్డ్ మ్యాప్ లో జమ్మూకశ్మీర్‌ ను

Update: 2022-01-31 11:38 GMT

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించడం.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత్ లోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని వరల్డ్ మ్యాప్ లో డబ్ల్యూహెచ్ఓ తన కోవిడ్ డ్యాష్ బోర్డులో చైనా - పాకిస్థాన్ లోని భాగంగా చూపించడం కలకలం రేపుతోంది. జమ్మూ కాశ్మీర్ భాగాన్ని పాకిస్థాన్, చైనా రంగులతో నింపేసింది డబ్ల్యూహెచ్ఓ. భారత్ లో అంతర్భాగమైన కాశ్మీర్ ను డబ్ల్యూహెచ్ఓ అలా చూపించడంపై పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ డా. శంతాను సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబ్ల్యూహెచ్ఓ చేసిన నిర్వాకంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. Covid19.WHO.int వెబ్‌సైట్‌ లోని వరల్డ్ మ్యాప్ లో జమ్మూకశ్మీర్‌ ను చైనా, పాకిస్తాన్‌ లో భాగంగా చూపుతున్నారని శాంతాను సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ దేశాల్లో కోవిడ్ పరిస్థితులను తెలుపుతూ.. డబ్ల్యూహెచ్ఓ ప్రతినిత్యం డేటా అప్ డేట్ చేస్తుంది. ఏ దేశంపై క్లిక్ చేస్తే.. ఆయా దేశాలకు సంబంధించిన కోవిడ్ వివరాలను చూపుతుంది. కానీ.. బ్లూ రంగులో వున్న ప్రాంతాన్ని క్లిక్ చేస్తే కశ్మీర్ లోని ప్రధాన భాగం చైనాలోనూ, కొంత భాగం పాకిస్తాన్ లోనూ కనిపించడం విస్మయానికి గురిచేసిందన్నారు ఎంపీ శంతాను సేన్. దీనిపై వెంటనే స్పందించాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇది తీవ్రమైన అంతర్జాతీయ సమస్యగా శాంతాను సేన్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News