భారత సైన్యం చేతుల్లోకి ఇన్వర్ క్షిపణి

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇప్పటికే ఆకాశ్, నాగ్ మిసైళ్లను భారత సైన్యానికి అందించింది.

Update: 2025-05-28 10:00 GMT

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇప్పటికే ఆకాశ్, నాగ్ మిసైళ్లను భారత సైన్యానికి అందించింది. త్వరలో మరో క్షిపణిని కూడా అందించబోతోంది. ఆ క్షిపణి పేరు 'ఇన్వర్‌'. యాంటీ- ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ అయిన ఇన్వర్‌ క్షిపణిని భారత సైన్యంలోని టీ-90 ట్యాంకులకు అమర్చుతారు.


అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో టీ-90 ట్యాంకులను, సైన్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ కొత్తరకం క్షిపణిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 500 క్షిపణులను బీడీఎల్‌ అందించనుంది. ఈ కాంట్రాక్టు విలువ 2,000 నుండి 3,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

Tags:    

Similar News