కరోనా కొత్తమాస్క్ : క్రిమిసంహారక మాస్క్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్తలు

ఈ మాస్కుల వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదని, భూమిలో చాలా సులువుగా కలిసిపోతాయని పరిశోధకులు చెప్తున్నారు.

Update: 2022-02-04 11:59 GMT

కరోనా.. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోన్న మహమ్మారి. ఈ మహమ్మారిని సమూలంగా నివారించేందుకు సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా భారతీయ పరిశోధకులు కరోనాపై పోరాడేందుకు వినూత్నమైన మాస్క్ ను అభివృద్ధి చేశారు. ఇదొక క్రిమిసంహారక మాస్క్. ప్రమాదకరమైన వైరస్, బ్యాక్టీరియా క్రిములను చంపగల సత్తా ఈ మాస్క్ సొంతం. ఈ మాస్క్ కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.

ఈ మాస్కుల వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదని, భూమిలో చాలా సులువుగా కలిసిపోతాయని పరిశోధకులు చెప్తున్నారు. ఈ మాస్క్ పై రాగితో కూడిన నానో పార్టికల్ పూత పూస్తారు. దాని వల్ల వైరస్ క్రిములు ఈ పొరను దాటి రావడం కష్టతరమవుతుంది. అలాగే ఈ మాస్కును ధరించడం వల్ల శ్వాస తీసుకోవడంలోనూ ఎలాంటి ఇబ్బందులు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రాగి ఆధారిత మాస్కు తయారీలో ఇంటర్నేషనల్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్ సీఐ), సీఎస్ఐఆర్, సీసీఎంబీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు బెంగళూరుకు చెందిన రెసిల్ కెమికల్స్ అనే ప్రైవేటు సంస్థ కూడా పాలుపంచుకుంది.



Tags:    

Similar News