Narendra Modi : జపాన్ లో మోదీ పర్యటన

భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ లో పర్యటిస్తున్నారు. టోక్యో విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు

Update: 2025-08-29 04:00 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ లో పర్యటిస్తున్నారు. టోక్యో విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. భారత ప్రధానికి గాయత్రి మంత్రంతో స్వాగతం జపాన్ వాసులు పలికారు. మోదీ పర్యటన సందర్భంగా ప్రవాహ భారతీయుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. జపాన్ లో రెండు రోజులు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పదిహేనవ జపాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.

పెట్టుబడులే లక్ష్యంగా...
పలు సమావేశాల్లో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ భారత్ కు పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటనను పెట్టుకున్నారు. సెమీ కండక్టర్ల సమావేశంలో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఉన్నతాధికారులతోనూ, రాజకీయ నేతలతోనూ ప్రత్యేకంగా భేటీ అయి రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చించనున్నారు.


Tags:    

Similar News