ఆపరేషన్ సింధూర్ పై రాజ్ నాధ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని నిలిపివేయలేదని భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు

Update: 2025-09-22 04:21 GMT

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉందని నిలిపివేయలేదని భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. రాజ్ నాథ్‌ సింగ్‌ సోమవారం పహాల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ గురించి ప్రస్తావించారు. పాకిస్థానీ ఉగ్రవాదులు దాడిలో మతం ఆధారంగా అమాయకులను హతమార్చగాభారత్‌ మాత్రం ఉగ్రవాదుల మతాన్ని కాదు, వారి చర్యలను చూసి లక్ష్యంగా చేసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్‌లో ఏ పౌరులు గానీ, సైనిక స్థావరాలు గానీ దెబ్బతినలేదని వివరించారు. పాక్ చర్యలపై ఆధారపడి ఆపరేషన్ సింధూర్ 2 ఆధారపడి ఉంటుందని తెలిపారు.

మోరాకో పర్యటనలో...
మొరాకో పర్యటనలో రాజ్‌నాథ్‌ స్థానిక భారతీయులతో రబాత్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రత్యేకతను గమనించాలని, ఉగ్రవాదులు మన పౌరులను మతం అడిగి చంపారని, కానీ తాము ఎవరి మతం చూడలేదని వారు చేసిన పనులను బట్టి చర్యలు తీసుకున్నామనతి తెలిపారు. ఏ మతం, ఏ వర్గం చెందిన వారినీ మేము వివక్ష చేయమని, అదే భారత స్వభావమని రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేసన్ సింధూర్ కు తాత్కాలిక విరామమే తప్ప పూర్తిగా ఆపలేదని ఆయన స్పష్టం చేశారు.


Tags:    

Similar News