India : నేడు పది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ దేశంలోని పది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది.

Update: 2025-09-25 03:31 GMT

భారత వాతావరణ శాఖ దేశంలోని పది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈరోజు దేశంలోని పది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

అప్రమత్తంగా ఉండాలని...
భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈరోజుచత్తీస్ గఢ్ , ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, గోవా రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించింది.


Tags:    

Similar News