ఐటీ డిపార్ట్ మెంట్ నుంచి కీలక అప్ డేట్
ఆదాయపు పన్ను శాఖ రిటర్న్ ల దాఖలకు గడువు పొడిగించడం లేదని ఐటీ విభాగం స్పష్టం చేసింది.
ఆదాయపు పన్ను శాఖ రిటర్న్ ల దాఖలకు గడువు పొడిగించడం లేదని ఐటీ విభాగం స్పష్టం చేసింది. ఐటీ రిటర్న్ కు దాఖలు చేసే గడువు పొడిగిస్తున్నట్లు వార్తలను నమ్మవద్దని ఆదాయపు పన్ను శాఖ కోరింది. అలాంటి నిరాధార వార్తలను ఎవరూ ప్రచురించవద్దని కూడా కోరింది. వాయిదా వేసినట్లు వస్తున్న వార్తలను నమ్మవదని, ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చే అప్ డేట్స్ ను పరిశీలించాలని సూచించింది.
రిటర్న్ దాఖలకు గడువు...
2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలాంటి జరిమానాలు లేకుండా ఆదాయపు పన్ను శాఖ రిటర్న్ దాఖలు చేసే గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకూ ఐటీ రిటర్న్ దాఖలు చేయని వారు ఈరోజు సమర్పించాలని తెలిపింది. ఇప్పటికే ఆరు కోట్ల మంది పైగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్ ను దాఖలు చేశారని ఆదాయపు పన్ను శాఖ చెప్పింది.