జైలుకు వెళ్లి వచ్చిన నేతలందరూ ఓటమి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సానుభూతి వైపు మొగ్గు చూపలేదు. జైలుకు వెళ్లి వచ్చిన నేతలను ఓడించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సానుభూతి వైపు మొగ్గు చూపలేదు. జైలుకు వెళ్లి వచ్చిన నేతలను ఓడించారు. వారికి అండగా నిలబడలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి తీహార్ జైలుకు వెళ్లి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఓటమిపాలయ్యారు. అలాగే సత్యేంద్ర జైన్ కూడా జైలుకు వెళ్లి వచ్చిన వారే.
ఢిల్లీలో మాత్రం...
ఆయనకూడా ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకూ జైలుకు వెళ్లి వచ్చిన నేతలు గెలుస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఢిల్లీలో మాత్రం ఫలితాలు రివర్స్ లో వచ్చాయి. జైలుకు వెళ్లి వచ్చిన నేతలందరూ ఓటమి పాలయ్యారు. అవినీతిని ఢిల్లీ ప్రజలు సహించలేదని ఈ ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతుంది.