అయోధ్యలో భారీ రావణాసురుడి విగ్రహం
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలో రామాయణ థీమ్ పార్కు సిద్ధమవుతూ ఉంది.
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలో రామాయణ థీమ్ పార్కు సిద్ధమవుతూ ఉంది. ఇక్కడ భారీ రావణాసురుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. 25 అడుగుల రావణాసురుడి విగ్రహం ఇక్కడ ఉండనుంది. పురాణ కాలంలో రామ, రావణుల మధ్య జరిగిన యుద్ధాన్ని తలపించేలా ఈ విగ్రహం ఉండనుంది. గుప్తార్ ఘాట్‌కు సమీపంలో తీర్చిదిద్దుతున్న ఈ పార్కులో రామాయణంలోని కీలక ఘట్టాలను కళ్లకు కట్టేలా పలు భారీ విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నట్లు అయోధ్య మేయర్ తెలిపారు. సీతారాములు, లక్ష్మణుడి విగ్రహాలతో రూపొందిస్తున్న ‘రామ్‌దర్బార్’ అద్భుత ఆకర్షణగా నిలవనుంది.