విరిగిపడ్డ కొండచరియలు.. 21 మంది మృతి

మేఘాల కారణంగా రెండు ఇళ్లు దెబ్బతినగా, అందులో ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. అక్కడ ఇద్దరు వ్యక్తులను రక్షించారు

Update: 2023-08-14 07:20 GMT

కొండ ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు మరోసారి భారీ వర్షాలతో అల్లాడిపోతున్నాయి. రాజధాని సిమ్లాలో కొండచరియలు విరిగిపడటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశారు. ఇంతకు ముందు సోలన్‌లో మేఘాలు పేలడంతో చాలా మంది చనిపోయారు. గత 24 గంటల్లో హిమాచల్‌లో దాదాపు 21 మంది మృతి చెందగా.. ఉత్తరాఖండ్‌లోని మాల్దేవ్తాలో డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం కుప్పకూలింది. ఇక్కడ ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు.

సోలన్ జిల్లాలోని కందఘాట్ సబ్ డివిజన్‌లోని జాదోన్ గ్రామంలో, మేఘాల కారణంగా రెండు ఇళ్లు దెబ్బతినగా, అందులో ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. అక్కడ ఇద్దరు వ్యక్తులను రక్షించారు. సిమ్లాలోని సమ్మర్‌హిల్‌లోని ఓ శివాలయం భారీ కొండచరియలు విరిగిపడింది. ఉదయం పూజల కోసం ఇక్కడికి వచ్చిన 20 మంది ఆలయ శిథిలాల కింద సమాధి అయ్యారు. పోలీసు యంత్రాంగం అక్కడికక్కడే ఉంది. చెత్తాచెదారాన్ని తొలగించే పనులు కొనసాగుతున్నాయి. కానీ ఇంతవరకు ఎవరి ఆచూకీ లభించలేదు.

హైవే పూర్తిగా మూసివేత

మండిలోని నాగ్‌చలాలో మేఘాల విస్పోటనం కాణంగా ఒక వరద చాలా చెత్తను మోసుకెళ్లి హైవేపైకి తీసుకువచ్చింది. అదృష్టవశాత్తూ నాగ్చల ప్రాంతంలో నివాస గృహాలు, దుకాణాలు, ఎత్తైన భవనాలు శిధిలాల నుంచి రక్షించారు పోలీసులు. అయితే మండి నుంచి కులు వరకు కలిపే హైవే పూర్తిగా మూసివేశారరు. జేసీబీ యంత్రాలతో హైవేను క్లీయర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

హిమాచల్‌లోని ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్

సిమ్లా, చంబా, కాంగ్రా, కులు, సంత, లాహౌల్ స్పితి, కిన్నౌర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 302 రోడ్లను మూసివేశారు. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 బస్సులు నిలిచిపోయాయి. 1184 ట్రాన్స్‌ఫార్మర్లలో పనిచేయకపోవడంతో అంధకారం నెలకొంది. ట్రాన్ఫార్మర్‌లు ఫెయిల్‌ కావడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిచిపోయింది.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, చంపావత్‌లో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మాల్దేవ్తాలోని డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం పేకముక్కల్లా కూలిపోయింది.




Tags:    

Similar News