Narendra Modi : నేడు మోదీ కీలక భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యున్నతస్థాయి సమావేశం జరగనుంది. జీఎస్టీ సహా పలు అంశాల్లో భారీ సంస్కరణలపై చర్చించనున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యున్నతస్థాయి సమావేశం జరగనుంది. కీలక మంత్రులు, పలుశాఖల ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. సెక్రటరీలు, ఆర్థిక వేత్తలతో ప్రధాని మోదీ, మంత్రుల కీలక చర్చలు జరపనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. కీలక అంశాలపై ప్రధాని మోదీ నేడు చర్చించనున్నారు.
జీఎస్టీ సంస్కరణలపై...
భవిష్యత్ సంస్కరణలకు రోడ్డుమ్యాప్ పై ప్రధాని మోదీ కీలక చర్చలు చేయనున్నారని సమాచారం. జీఎస్టీ సహా పలు అంశాల్లో భారీ సంస్కరణలకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశంలో మంత్రులు, అధికారుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. అందుకోసమే ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.