ఢిల్లీలో నేడు హైలెవల్ కమిటీ మీటింగ్
ఢిల్లీలో నేడు ప్రధానమంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. అమెరికా అదనపు సుంకాలపై నేడు ఢిల్లీలో కీలక భేటీ జరగనుంది.
ఢిల్లీలో నేడు ప్రధానమంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. అమెరికా అదనపు సుంకాలపై నేడు ఢిల్లీలో కీలక భేటీ జరగనుంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై నేడు ప్రధానమంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం ట్రంప్ టారిఫ్ లు అమల్లోకి రానున్న నేపథ్యంలో కీలకభేటీ జరగనుంది.
ట్రంప్ సుంకాలపై...
భారత్ ఎగుమతులపై పడే ప్రభావంపై చర్చించే అవకాశం కనపడుతుంది. అత్యవసర రుణపరపతి హామీ పథకం అందుబాటులోకి తేవాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. దీనిపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు సుంకాల అమలు గడువు సమీపిస్తున్న వేళ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీలేదన్న ప్రధాని మోదీ, రైతులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలపై రాజీపడబోమని స్పష్టీకరించారు. ఈ విషయంలో ఒత్తిడులు పెరిగినా భరిస్తామని వెల్లడించడంతో నేడు కీలక భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.