ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వర్షాలు

ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు పడుతున్నాయి. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో మెరుపు వరదలతో అనేక మంది గల్లంతయ్యారు

Update: 2025-08-25 04:44 GMT

ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు పడుతున్నాయి. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో మెరుపు వరదలతో అనేక మంది గల్లంతయ్యారు. జమ్మూ - పఠాన్ కోట్ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్యమైన వంతెన ఈ వరదలతో దెబ్బతినింది. సహర్ ఖడ్ నది పొంగి ప్రవహించడంతోనే వంతెన కూలిపోయిందని అధికారులు తెలిపారు.

ప్రమాదకరంగా నదులు...
భారీ వర్షాలకు కాల్వలు, నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని ఎవరూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు కోరారు. అయితే ఈ వరదలతో అనేక మంది గల్లంతయ్యారని చెబుతున్నారు. సంఖ్య ఎంత అనేది తేలకపోయినా వందల్లోనే గల్లంతయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. మరొకవైపు సహాయక బృందాలు నిరంతరం భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలిచి వారిని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు.


Tags:    

Similar News