ఉత్తర భారతాన్ని వణికిస్తున వర్షాలు.. జమ్మూలో క్లౌడ్ బరస్ట్
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోసారి జమ్మూకాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోసారి జమ్మూకాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నదులు పొంగి ప్రవహిస్తుున్నాయి. అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో రహదారులను అన్ని మూసివేశారు. జమ్మూ కాశ్మీర్ లో ధోడా లో క్లౌడ్ బరస్ట్ తో పదుల సఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఉత్తర భారతదేశంలో ఈ నెల 31వ తేదీ వకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
నదులు ప్రమాదకరంగా...
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మూడో రోజు కూడా అతి భారీ వర్షాలు పడుతుండటంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర స్థాయిలో నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక జాతీయ రహదారులు మూసివేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కిశ్త్ వాడ్, దోడా, రాజౌరీ జిల్లాలో అనేక ఇళ్లు వరదల తాకిడి దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను చేపట్టారు. పునరావాస కేంద్రాలకు తరలించారు. అనేక చోట్ల ప్రజలు ఇళ్లలో చిక్కుకుని ఉండటంతో వారిని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మాతోదేవి వైష్ణోదేవి దర్శనం రద్దు...
జమ్మూకాశ్మీర్ లోని అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అక్కడ బోర్డులను ఏర్పాటు చేశారు. మాతా వైష్ణోదేవి దర్శనాన్ని ముందు జాగ్రత్త చర్యగా నిలిపేశఆరు. చినాబ్ నది ఉపనది ఉగ్రరూపం దాల్చింది. ఉధంపూర్ లో ఇరవై అడుగులు దాటి ఉప నది ప్రవహిస్తుంది. దీంతో అనేక రహదారులను అధికారులు మూసి వేసి అక్కడ పోలీసులను కాపలాగా ఉంచారు. కతువా జిల్లలో రావి నదిపై ఉన్న మోదోపుర్ బ్యారేజీకి లక్ష క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. మరింత నదీ ప్రవాహం పెరిగే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు మానుకోవాలని, నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు.