Cloud Burst : ఉత్తరాఖండ్ కు వెళ్లొద్దు.. అక్కడ ప్రమాదరకమైన పరిస్థితులు..డేంజర్

భారత దేశంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర భారతదేశంలో మళ్లీ క్లౌడ్ బరస్ట్ జరిగింది.

Update: 2025-09-16 05:54 GMT

భారత దేశంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర భారతదేశంలో మళ్లీ క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఉత్తరాఖండ్ లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద వెల్లువలా వచ్చి పడటంతో ఉత్తరాంఖండ్ లో అనేక మంది గల్లంతయినట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌లో రాత్రిపూట కురిసిన భారీ వర్షాలు మంగళవారం ఉదయం రహదారులు, ఇళ్లు, దుకాణాలు దెబ్బతినడమే కాక వంతెనను కొట్టుకుపోయాయి. అధికారులు తెలిపిన సమాచారం మేరకు డెహ్రాడూన్‌లోని సహస్రధార, మాల్ దేవత, మసూరీలో నష్టం జరిగింది. డెహ్రాడూన్‌లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారని తెలిసింది. మసూరీ లో ఒకరు మృతిచెందినట్లు అధికారుల ధృవీకరించారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నా...
భారీగా వర్షం కురిసిన ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు మూడు వందల నుంచి నాలుగు వందల మంది ప్రజలని సురక్షిత ప్రదేశాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. టేహ్రీలో గీతా భవన్ వద్ద నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇరుక్కుపోయారని, వారిని రక్షించామని అధికారులు చెప్పారు. నైనిటాల్‌లో ఒక రహదారి కొండచరియలు విరిగిపడటంతో మూసుకుపోయింది. మజ్హారా గ్రామంలో ఉదయం భారీగా వరద ముంచెత్తడంతో కొందరు గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. ఉత్తరాఖండ్ లో దాదాపు కొన్ని రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కొండ ప్రాంతాల్లో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన...
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ ‌లో స్పందిస్తూ “డెహ్రాడూన్ సహస్రధారాలో వర్షాల కారణంగా దుకాణాలు దెబ్బతినడం దురదృష్టకరం. జిల్లా అధికారులు, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. నేను నిరంతరం స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నాను. అందరి భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని పుషర్ సింగ్ ధామి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పుషర్ సింగ్ ధామి వరద నష్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సమాచారం అందజేశారు. కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ధామీ డెహ్రాడూన్ జిల్లా వర్షబాధిత ప్రాంతాలను పర్యటిస్తున్నారు.


Tags:    

Similar News