ఢిల్లీలో ధర్డ్ వేవ్ మొదలయింది
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ధర్డ్ వేవ్ మొదలయిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ధర్డ్ వేవ్ మొదలయిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఒక్కరోజులోనే పదివేల కరోనా కేసులు నమోదవ్వడం థర్డ్ వేవ్ కు సంకేతమని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.37 శాతంగా ఉందని చెప్పారు. అయితే కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
ఇప్పటికే చర్యలు....
ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సినిమాహాళ్లను, మాల్స్ ను మూసివేసింది. నైట్ కర్ఫ్యూను విధించింది. వీకెండ్ కర్ఫ్యూ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచింది. ప్రత్యేకంగా కోవిడ్ బెడ్స్ ను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ కొరత లేకుండా నిల్వలు ఉండేలా చూసుకుంటుంది. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని ఢిల్లీ ప్రభుత్వం కోరుతుంది.